XtGem Forum catalog
Teluguworld.wap.sh






Uyyala Jampala 2013


విడుదల తేదీ : 25 డిసెంబర్ 2013
TeluguWorld.wap.sh : 3.5/5
దర్శకుడు : విరించి వర్మ
నిర్మాత : సన్ షైన్ ప్రొడక్షన్స్ – అన్నపూర్ణ స్టూడియోస్
సంగీతం : సన్నీ ఎంఆర్
నటీనటులు : రాజ్ తరుణ్, అవిక గోర్..

‘అష్టా – చమ్మా’, ‘గోల్కొండ హైస్కూల్’ లాన్న్తి సినిమాలను నిర్మించిన సన్ షైన్ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ తో కలిసి నిర్మించిన అచ్చమైన పల్లెటూరి సినిమా ‘ఉయ్యాలా జంపాలా’. రాజ్ తరుణ్, అవిక గోర్ లను తెరకి పరిచయం చేయనున్న ఈ సినిమా ద్వారా విరించి వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తెలుగుదనం ఉట్టిపడేలా తీసిన ఈ సినిమాలో బావా మరదళ్ల ప్రేమ కథని చూపించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా క్రిస్మస్ కానుకగా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని మేము ప్రత్యేకంగా ముందే చూడటం జరిగింది. కావున ఒకరోజు ముందే ఈ సినిమా రివ్యూని మీకందిస్తున్నాం..

కథ :
ఈ అచ్చమైన పల్లెటూరి సినిమా కథ బావామరదల్లైన సూరి(రాజ్ తరుణ్) – ఉమాదేవి(అవిక గోర్) మధ్య జరుగుతుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసి పెరిగినా, వీళ్ళిద్దరూ ప్రతి చిన్నదానికి బాగా కొట్టుకుంటూ, ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. సూరి ఉమాదేవి పై ఎప్పుడూ జోక్స్ వేస్తూ ఉంటాడు దాంతో ఉమాదేవి సూరిపై రివెంజ్ తీర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సూరి తన తల్లి(అనిత చౌదరి)కి అన్నింటిలోనూ చాలా సాయం చేస్తూ ఉంటాడు.

ఉమాదేవి పార్ధు అనే అతనితో ప్రేమలో పడుతుంది. కానీ దాని వల్ల ఉమాదేవి కొన్ని ఇబ్బందుల్లో పడుతుంది. వాటినుండి సూరి ఉమాదేవిని కాపాడతాడు. అప్పుడే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం అనే విషయం వారికి తెలుస్తుంది. అప్పుడే వారి కుటుంబంలో కొన్ని సమస్యలు రావడంతో ఉమాదేవికి పెళ్లి ఫిక్స్ చేస్తారు. అప్పుడు సూరి ఎం చేసాడు? సూరి – ఉమాదేవిలు తమ మదిలోనే ప్రేమని బయటపెట్టారా? లేదా? చివరికి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిందా? లేదా? అనేది మీరు తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :
తెలుగు ఇండస్ట్రీకి దొరికిన మరో మంచి నటుడు రాజ్ తరుణ్. ఈ యంగ్ స్టర్ లో మంచి టాలెంట్, ఎనర్జీ, నటన పట్ల తపన ఉంది. అతని పాత్రని చాలా పర్ఫెక్ట్ గా చేసిన రాజ్ తరుణ్ కి మంచి భవిష్యత్ ఉందని చెప్పవచ్చు. ఇలాంటి తరహా సినిమాలకు, పాత్రలకు రాజ్ తరుణ్ పర్ఫెక్ట్ గా సరిపోతాడు. అవిక గోర్ చక్కటి నటనను కనబరిచింది. బాలిక వధు/చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా తనకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమాలో అందరినీ సర్ప్రైజ్ చేసేది అంటే అది పునర్నవి. తన నటన చాలా బాగుంది. సూరి అంటే అమితంగా ప్రేమించే పాత్రలో పునర్నవి లుక్ చాలా బాగుంది.

అనిత చౌదరి, మిగతా నటీనటులు తమ పాత్ర పరిధిమేర చక్కని నటనని కనబరిచారు. ఈ సినిమా సెకండాఫ్ లో మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. అందులో కొన్ని సీన్స్ మీకు బాగా కనెక్ట్ అవుతాయి. ప్రతి పాత్రని తీర్చి దిద్దిన విధానం మరియు డైలాగ్స్ బాగున్నాయి. సినిమాలోని ప్రీ క్లైమాక్స్ సీన్ మీ హృదయాన్ని అమితంగా ఆకట్టుకుంటుంది. చిన్న బడ్జెట్ సినిమా అని చెప్పుకున్నప్పటికీ విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. అలాగే సినిమాకి పర్ఫెక్ట్ గా సరిపోయే వారిని నటీనటులుగా ఎన్నుకున్నారు.

మైనస్ పాయింట్స్ :
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులకి సెకండాఫ్ కనెక్ట్ అయిన రేంజ్ లో కనెక్ట్ అయ్యేలా లేదు. అలాగే సినిమాలో మొదటి 30 నిమిషాలు ఏదో అలా అలా సాగుతుంది. హృదయాన్ని ఆకట్టుకునే ప్రీ క్లైమాక్స్ సీన్స్ తర్వాత క్లైమాక్స్ సరిగా తీయలేదు. క్లైమాక్స్ సీన్స్ ని ఇంకాస్త బెటర్ గా తీసి ఉంటే బాగుండేది. సినిమాలో పాటలు బాగున్నప్పటికీ సినిమాలో మాత్రం అవి పెద్దగా హెల్ప్ అవ్వలేదు. ఈ సినిమా ఎక్కువగా ఎ సెంటర్స్ మరియు మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ కి నచ్చే సినిమా అవుతుంది. మీకు బాగా నవ్వుకునే కామెడీ, మాస్ ఎలిమెంట్స్ కావలనకుంటే మాత్రం ఈ సినిమాకి దూరంగా ఉండవచ్చు.

సాంకేతిక విభాగం :
ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సినిమాటోగ్రఫీ. పల్లె టూరిలోని అందాలని చాలా బాగా చూపించారు. సన్నీ ఎంఆర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ బాగుంది కానీ ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఇంకాస్త కత్తిరించి ఉంటే బాగుండేది. మొదరి సినిమా అయినప్పటికీ డైరెక్టర్ విరించి వర్మ డైరెక్షన్ బాగుంది. అలాగే డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి.

తీర్పు :
చివర్లో ప్రేక్షకుల ముఖంలో చిరునవ్వును నింపే అందమైన పల్లెటూరి ప్రేమకథే ‘ఉయ్యాలా జంపాలా’. ఈ సినిమాలో మంచి ఎమోషనల్ సీన్స్ మరియు నటీనటుల పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి హైలైట్ అయితే కాస్త స్లోగా అనిపించే ఫస్ట్ హాఫ్ చెప్పదగిన మైనస్ పాయింట్. మీరు ఈ వారాంతంలో ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడాలనుకుంటే మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా హ్యాపీ గా మీ ఫ్యామిలీతో ఈ సినిమాకి వెళ్ళవచ్చు.

TeluguWorld.wap.sh:-3.5/5




Users Online


2432